కరోనా పీడుతుల సేవలో ఆ ప్రభుత్వాసుపత్రి నెంబర్ వన్!

కరోనా పీడుతుల సేవలో ఆ ప్రభుత్వాసుపత్రి నెంబర్ వన్!
x
Highlights

కోవిడ్ ప్రభలుతున్న వేళ రోగులు తమతమ ఆర్ధిక స్తోమతను బట్టి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం...

కోవిడ్ ప్రభలుతున్న వేళ రోగులు తమతమ ఆర్ధిక స్తోమతను బట్టి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందడం లేదని చాలామంది ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఐతే ఏపీలో ఓ ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం అన్ని వర్గాల వారు అక్కడే ట్రీట్ మెంట్ చేసుకునేలా చేసింది. అదెక్కడా..? ఎలా సాధ్యం అయ్యింది..?

ప్రకాశం జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 50 వేల మంది కరోనా బారిన పడ్డారు. తొలుత జిల్లాలో కోవిడ్ బారిన పడి పేద, మధ్యతరగతి వారు జీజీహెచ్ లో వైద్యం తీసుకున్నారు. అక్కడ కోలుకొని వారంతా తిరిగి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అవ్వడం మిగిలిన వర్గాల ప్రజలు గమనించారు. మొదట జిల్లాలో కొందరు రాజకీయ ప్రముఖులు ధైర్యం చేసి ఇక్కడ వైద్యం చేయించుకొని క్షేమంగా తిరిగి రావడంతో జీజీహెచ్ కి కోవిడ్ రోగులు బారులు తీరారు. సామాన్యుల నుంచి బడా పారిశ్రామికవేత్తలు, సాక్షాత్తు జిల్లా పోలీస్ శిక్షణ విభాగంలో ప్రిన్సిపాల్, జడ్పీ సీఈఓ ఇలా పెద్ద పెద్దవారు చేరడంతో జిజిహెచ్ పై పూర్తిస్థాయిలో ప్రజలకు నమ్మకం పెరిగింది.

ఐతే రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల్లో కోవిడ్ కు సరైన వైద్యం అందడం లేదని ఓవైపు సోషల్ మీడియా కోడై కూస్తున్న వేళ ప్రకాశం జిల్లా మాత్రం దానికి భిన్నంగా పేరు తెచ్చుకుంది. దానికి కారణం జీజీహెచ్ లో వైద్య బృందం అందించిన సేవలే. కేవలం 450 మందికి మాత్రమే చికిత్స అందించే అవకాశాలున్న ఇక్కడ 950 మందికి బెడ్లను ఏర్పాడు చేసి సేవలందించారు. ఇప్పుడు కోవిడ్ వైద్యం కోసం ఎంత చిన్న ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లినా కనీసం రెండు లక్షలు వసూలు చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 50 వేల పాజిటివ్ కేసులను జీజీహెచ్ లో ట్రీట్ మెంట్ చేసారు. ఈ లెక్కన పరోక్షంగా రెండు వందల కోట్ల ప్రజల సొమ్మును జీజీహెచ్ వైద్యులు ఆదా చేయించినట్లే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేం ఉన్నామంటూ జీజీహెచ్ వైద్యులు ప్రజలకు ఇచ్చే నమ్మకాన్ని దేనితో కొలవగలం..?

Show Full Article
Print Article
Next Story
More Stories