Omicron Case in AP: ఏపీలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు

ధృవీకరించిన ఏపీ వైద్యారోగ్యశాఖ విజయనగరంలో ఒమిక్రాన్‌ కేసు గుర్తింపు ఐర్లాండ్‌ నుంచి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌

Sandeep Reddy
Updated on: 12 Dec 2021 1:16 PM IST
Corona New Variant Omicron Case Found in Vizianagaram  Andhra Pradesh
X

ఏపీలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు

Omicron Case in AP: ఏపీలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిర్ధారించింది. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకినట్లు వెల్లడించింది. ఈ వ్యక్తి గత నెల 27న ఐర్లాండ్‌ నుంచి ముంబై మీదుగా విశాఖ వచ్చాడు. విశాఖ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా కరోనా నిర్ధారణ అయింది. అతడి నమూనాను సీసీఎంబీకి పంపగా ఒమిక్రాన్‌గా తేలినట్లు వెల్లడించింది.

ఏపీలో నమోదైన కేసుతో కలిపి దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 34కి చేరింది. కాగా.. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో నమోదైన కేసుతో కలిపి 35కి చేరుకుంది. అత్యధికంగా మహారాష్ట్రలో 17 కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆరాష్ట్ర రాజధాని ముంబైలో రెండు రోజులపాటు 144 సెక్షన్‌ విధించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story