విజయనగరం జిల్లాలో కరోనా బీఎఫ్ -7 వేరియంట్ కలకలం

Vizianagaram: బొండపల్లి మండలానికి చెందిన మహిళకు సోకిన కరోనా న్యూ వేరియంట్

Jyothi
Published on: 4 Jan 2023 11:44 AM IST
Corona New Variant Infected Woman In Vizianagaram
X

విజయనగరం జిల్లాలో కరోనా బీఎఫ్ -7 వేరియంట్ కలకలం

Vizianagaram: విజయనగరం జిల్లాలో కరోనా బీఎఫ్ -7 వేరియంట్ కలకలం రేపింది. జిల్లాలోని బొండపల్లి మండలానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్ బీఎఫ్ - 7 నమోదు సోకడం కలవరానికి గురిచేస్తోంది. ఆస్ట్రేలియా నుంచి విశాఖ ఎయిర్‌పోర్టు ద్వారా స్వగ్రామానికి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన భార్యాభర్తలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో పరీక్షలు నిర్వహించారు. భార్యకు కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయింది. దీంతో ఆమెకు కరోనా సోకడంతో నిర్ధారణ కోసం శాంపిళ్లను జిల్లా వైద్యాధికారులు విజయవాడ ల్యాబ్‌కు పంపించారు. అధికారులు కరోనా సోకిన మహిళను హోమ్ ఐసొలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా కొత్త వేరియంట్ బీఎఫ్ - 7 సోకిందా..? లేక సాధారణ కరోనా అనే విషయం తేలాల్సి ఉంది.

Jyothi

Jyothi

Next Story