Corona Cases in AP: ఏపీలో విజృంభిస్తోన్న కరోనా..

Corona Cases in AP: విశాఖ, చిత్తూరు జిల్లాల్లో భారీగా నమోదవుతున్న కేసులు

Rama Rao
Published on: 18 Jan 2022 1:34 PM IST
Corona Cases in Andhra Pradesh | AP News Today
X

ఏపీలో విజృంభిస్తోన్న కరోనా.. 

Corona Cases in AP: ఏపీలోనూ వైరస్ పంజా విసురుతోంది. రెండు వారాల క్రితం వరకు వంద మార్కుకి పడిపోతూ వచ్చిన కొవిడ్ కేసులు ఒక్కసారిగా వేగం పెంచాయి. నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే ప్రమాద ఘంటికలు మోగతున్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 30 వేలకు చేరుకున్నాయి.

మూడో దశలో వైద్యులపైనా కరోనా విరుచుకుపడుతోంది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండెంట్ సహా సుమారు 50 మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడగా కడప రిమ్స్‌లో 48 మంది వైద్య విద్యార్థులకు వైరస్ సోకింది. విశాఖలో ఆరుగురు వైద్య సిబ్బంది, శ్రీకాకుళంలో ఐదుగురు ప్రభుత్వ వైద్యులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Rama Rao

Rama Rao

Next Story