Corona: కరోనా సోకిందని యువకుడి బలవన్మరణం

Corona: కరోనా పాజటివ్ అని తేలడంతో పురుగుల మందు తాగిన షేక్ విలాయత్

Sandeep Eggoju
Published on: 16 April 2021 3:10 PM IST
Corona: కరోనా సోకిందని యువకుడి బలవన్మరణం
X

Representational Image

Corona: కరోనా విజృంభణతో జనం వణికిపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అని తేలడంతోనే భయంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెదవేగి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన షేక్ విలాయత్ గుంటూరు స్పిన్నింగ్ మిల్లులో పని చేస్తున్నాడు. కరోనా పరీక్షలు చేయించుకున్న విలాయత్ సొంత గ్రామం పెదవేగికి చేరుకున్నాడు. కరోనా పాజిటీవ్ అంటూ ఫోన్ రావడంతో ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఫోన్ కట్ విలాయత్. వెంటనే అతని కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూసే సరికి విగతజీవిగా పడి ఉన్నాడు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story