Top
logo

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు శునకం.. కీలక కేసులను చేధించిన శునకం షాడో

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు శునకం.. కీలక కేసులను చేధించిన శునకం షాడో
X
Highlights

నేరస్థుల ఆచూకీ కనుగొనడంలో దిట్ట. పోలీస్‌లు చేయాల్సిన పనులను సమర్థవంతంగా నిర్వహించింది. అవసరాన్నిబట్టి తన...

నేరస్థుల ఆచూకీ కనుగొనడంలో దిట్ట. పోలీస్‌లు చేయాల్సిన పనులను సమర్థవంతంగా నిర్వహించింది. అవసరాన్నిబట్టి తన డ్యూటీని చక్కగా నిర్వహించింది. బుల్లి పోలీస్‌ శునకం ప్రతిభకు అందరూ ఫిదా అవుతారు. ఎంతో మంది మన్నలు పొందిన ఆ పోలీస్‌ శునకం తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో పోలీసులు కన్నీరు మున్నీరుగా విలపించారు. క్రైమ్ బ్యాచ్ షాడోగా పెరొందిన జగిలాన్ని గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.

ప్రకాశం జిల్లాకు చెందిన శునకం షాడో ఈ పేరు చెబితేనే నేరస్తులు హడలిపోతారు. క్రైమ్‌ బ్యాచ్‌కు చెందిన షాడో ఎక్కడ ఏ నేరం జరిగినా ఆ నిందితుల జాడను ఇట్టే కనిపెట్టేస్తుంది. నేరం జరిగిన గంటల వ్యవధిలోనే ముద్దాయిలను పసికట్టేస్తుంది. శునకమే అయినప్పటికి చాలా పవర్‌ఫుల్‌గా పనిచేసింది. అంకిత భావంతో పనిచేసిన షాడో విధి నిర్వహణలో అసువులు బాసింది. ఎంతో తెగువ చూపిన 18 నెలల షాడో బెలిజయన్‌ మలాస్‌ జాతికి చెందింది.

మంగళగిరి ఇంటిలిజెన్స్ విభాగంలో స్పెషల్ ట్రైనింగ్ పొందిన షాడో చాలా యాక్టివ్. పెద్ద పెద్ద కేసులైనా చిటికెలో పరిష్కరించేందుకు పోలీసులకు హెల్ప్ చేస్తోంది. ఒక్కసారి రంగంలోకి దిగితే చాలు ఇక నేరస్థుడు పోలీసులకు చిక్కినట్టే. ఘటన స్థలంలో షాడో ఉందని తెలిస్తే నేరస్థులకు హడలే ఎలాంటి నేరస్తుడికైన షాడోను చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అలాంటి చురుకైన శునక సంరక్షణ బాధ్యతలను కానిస్టేబుల్‌ మస్తాన్‌కు అప్పగించారు అధికారులు. కీలకమైన కేసుల్లో నిందితులను పట్టించి పోలీస్‌శాఖకే మంచి పేరు తీసుకువచ్చిన షాడోకు డీజీ బంగారు పతకాన్ని సైతం అందించారు.

పోలీస్ డిపార్ట్మెంట్ లో షాడోకు పెద్ద ట్రాక్ రికార్డ్ ఉంది. సుమారు 12 కేసుల్లో అనుమానాల నివృత్తి చేయడంలో, క్లూస్ సేకరణలో సేవలందించింది. జంట హత్య కేసులో నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించడంతో పాటు 40 లక్షల రికవరీలో కీలక పాత్ర పోషించింది. మెరుగైన సేవలు అందిస్తు దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా మరణించింది ఈ డేరింగ్ పోలీస్ డాగ్. తుది శ్వాస వదిలే వరకు విధినిర్వహాణలోనే కొనసాగిన శునకానికి సెల్యూట్‌ చేయడంతో పాటు విచారం వ్యక్తం చేశారు. డిపార్ట్‌మెంట్‌కు సేవచేసిన షాడో రియల్‌ హీరో అంటూ కొనియాడారు.

పోలీస్‌ శాఖలోనే కాదు బయట కూడా షాడోకు ఫుల్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. షాడో మరణాన్ని పలువురు జీర్ణించుకోలేకపోయారు. కుటుంబసభ్యులను కోల్పోయినట్లు బోరున విలపించారు. ఇక కానిస్టేబుల్‌ మస్తాన్‌ను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఎంతోమంది అభిమాన్ని సొంతం చేసుకున్న పోలీస్‌డాగ్‌కు పోలీస్‌ లాంఛనాలతో అంతిమ యాత్ర చేశారు. జాగిలానికి ఇచ్చిన గౌరవాన్ని చూసి స్ధానికులు హర్షం వ్యక్తం చేయడంతో పాటు పోలీసులను అభినందించారు.


Next Story