ముదురుతున్న విజయనగరం మహారాజా కళాశాల ప్రైవేటీకరణ వివాదం

ముదురుతున్న విజయనగరం మహారాజా కళాశాల ప్రైవేటీకరణ వివాదం
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం మహారాజా కళాశాల వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. కాలేజీని ప్రైవవేటీకరించడాన్ని టీడీపీ తీవ్రంగా తప్పుపడుతోంది. దీని...

ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం మహారాజా కళాశాల వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. కాలేజీని ప్రైవవేటీకరించడాన్ని టీడీపీ తీవ్రంగా తప్పుపడుతోంది. దీని వెనుక పెద్ద కుట్ర ఉందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ట్రస్టు సభ్యుల నిర్ణయం వేలాదిమంది విద్యార్దులకు భారంగా మారనుందని పలు విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. పేద విద్యార్దులకు విద్యనందించాలన్న లక్ష్యంగా ఏర్పాటైన ట్రస్టు ప్రస్తుతం కళాశాలను నడపలేని స్థితికి చేరుకోవడం విద్యార్దుల పాలిట శాపంగా మారబోతుంది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మాన్సాస్ ట్రస్టు వివాదంపై hmtv ప్రత్యేక కధనం.

విజయనగరం రాజవంశీయులు పేద విద్యార్దులకు ఉచితంగా విద్యనందించడానికి ఎర్పాటు చేసిన మాన్సాస్ ట్రస్టు నేడు ప్రైవేటికరణ దిశగా అడుగులు వేస్తోంది. ట్రస్టు ఆదీనంలో ఉన్నమహారాజ కళాశాలలను ప్రైవేటికరణ చెయ్యాలన్న ట్రస్టు సభ్యుల నిర్ణయాణికి పేద విద్యార్దుల భవిష్యత్ అగాదంలో పడనుంది. విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుండి వేలాది మంది పేద విద్యార్దులు మహరాజ కళాశాలలో చదువుతుండటంతో వీరందరు రానున్న రోజుల్లో విద్యనందుకోవడం కష్టంగా మారనుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక పివిజి రాజుగారి ఆశయాలకు తూట్లు పోడిచేలా నేటి చైర్మన్ సంచయిత నిర్ణయాలను తీసుకుంటున్నారని విద్యార్ది సంఘ నాయుకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

1879లో ఆనాటి రాజ వంశీయులు పివిజి రాజుగారు పేదవారికి ఉచితంగా విద్యనందించాలనే లక్ష్యంగా మాన్సాస్ ట్రస్టును ఏర్పాటు చేశారు. వేలాది ఎకరాల భూములను ఇచ్చి వాటి ద్వారా వచ్చిన నిధులతో కళాశాలలను ఏర్పాటు చేసి పేదవారికి ఉచితంగా విద్యనందించేలా చర్యలు తీసుకున్నారు. అయితే నేడు ట్రస్టు చైర్మన్ మారడంతో ట్రస్టు ఆదీనంలో ఉన్న మహరాజ కళాశాలలను ప్రైవేటికరణ చెయ్యాలని తీర్మానించారు. దీంతో ఇప్పటికే మహరాజ కళాశాలలో పెరిగిన పీజులను కట్టుకోలేక అల్లాడుతున్న పేద విద్యార్దులకు ప్రైవేటికరణ చేస్తే ఇకపై చదువుకోలేని పరిస్థితులు నెలకొంటాయని విద్యార్దులు ఆవేదన చెందుతున్నారు.

మాన్సాస్ ట్రస్టులో కేజి నుండి పీజి వరకు ఎన్నో కళాశాలలు ఉన్నాయి. ఈ మహరాజ కళాశాలల ద్వారా ప్రతీ యేట 4 వేల మంది పేద విద్యార్దులు చదువుకుంటున్నారు. ఆనాటి రాజురికపు కాలం నుండి నేటి వరకు ఉచితంగానే విద్యనందుకుంటున్నారు విద్యార్దులు. కానీ నేటు మహరాజ కళాశాల ప్రైవేటు చెయ్యడానికి నిర్ణయించుకోడంతో పేద విద్యార్దులంతా ఆందోళన చెందుతున్నారు. పూసపాటి వంశీయులకు చెందిన దశాబ్దాల నాటి మహారాజా కళాశాలను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించడం పెను సంచలనం రేపుతోంది. ఈ నిర్ణయంపై టీడీపీతో పాటు విద్యార్ధి సంఘాలు కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ట్రస్ట్ సభ్యులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

మాన్సాస్ ట్రస్టు సభ్యులు మహరాజ కళాశాలలను ప్రైవేటికరణ చెయ్యనున్నట్లు తెలిపినప్పటి నుండి విద్యార్దులు ఆందోళన చెందుతున్నారు. అధిక ఫీజులు కట్టి ప్రైవేటు కళాశాలలో చదువుకోలేక ఉచిత విద్య అందక దిక్కుతోచని పరిస్థితి నెలకోంటుందని భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ట్రస్టు సభ్యులు తమ నిర్ణయాన్ని మార్చుకుని ప్రైవేటికరణ ఆలోచనను వెనకకు తీసుకోవాలని కోరుతున్నారు.

మాన్సాస్ ట్రస్టు ఎర్పాటు ఎందుకు జరిగిందో తెలియకుండా అడ్డదిడ్డంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో మహ ఆశయాన్ని దెబ్బ తీసేవిదంగా నేటి ట్రస్టు సభ్యుల నిర్ణయాలు ఉంటున్నాయని, ఎంఆర్ కళాశాలకు చరిత్ర ఉంది అటువంటి వాటిని ప్రైవేటీకరణ చెయ్యవల్సిన అవసరం ఎందుకోచ్చిందో తెలపాలని ట్రస్టు మాజీ చైర్మన్ పూసపాటి అశోక గజపతిరాజు కోరారు. మాన్సాస్ ట్రస్టు పరిదిలోని ఎమ్మార్ కళాశాలలను ప్రైవేటికరించడమన్నది వేలాదిమంది విద్యార్దుల భవిష్యత్ నాశనం చెయ్యడమేనని కనుక ట్రస్టు సభ్యులు ఎమ్మార్ కళాశాలను ప్రైవేటికరణను ఉప సహరించుకుని ట్రస్టు ఆశయాన్ని కాపాడడంతో పాటు వేలాది మంది విద్యార్దుల భవిష్యత్ కాపాడినట్లవుతుంది. పాలకులు ఆవిదంగా చర్యలు తీసుకుంటారని కోరుకుందాం.

Show Full Article
Print Article
Next Story
More Stories