కోనసీమ జిల్లాలో కొనసాగుతున్న 144 సెక్షన్

Konaseema: 16 మండలాల్లో నిలిచిపోయిన ఇంటర్‌నెట్ సేవలు

Rama Rao
Updated on: 1 Jun 2022 3:27 PM IST
Continuing Section 144 in Konaseema District | AP News
X

కోనసీమ జిల్లాలో కొనసాగుతున్న 144 సెక్షన్

Konaseema: కోనసీమ జిల్లాలో పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ కొనసాగుతున్నాయి. అమలాపురంలో వెయ్యి మంది పోలీసులు పహారా కాస్తున్నారు. 16 మండలాల్లో ఇంటర్‌నెట్ సేవలు నిలిచిపోగా.. సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా తొలిదశలో సఖినేటి పల్లి, మలికిపురం, ఐపోలవరం, ఆత్రేయపురం మండలాలకు ఇంటర్‌నెట్‌ సేవలు పున:రుద్ధరణ జరిగాయి. మరోవైపు 2లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఆఫ్‌లైన్‌లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇక వీర్‌వోల ధృవీకరణతో రేషన్ బియ్యం పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.


Rama Rao

Rama Rao

Next Story