GV Reddy: టీడీపీలోకి చేరనున్న కాంగ్రెస్ నేత జీవీరెడ్డి

* గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన చంద్రబాబు * ఈ నెల 21న టీడీపీ కండువా కప్పుకోనున్న జీవీరెడ్డి

Shilpa
Published on: 18 Oct 2021 7:28 AM IST
Congress Leader GV Reddy will Join the TDP
X

టీడీపీలోకి చేరనున్న కాంగ్రెస్ నేత జీవీరెడ్డి(ఫైల్ ఫోటో)

GV Reddy: కాంగ్రెస్‌ నేత జీవీరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. నిన్న ఆయన ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. పార్టీలో చేరేందుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమైంది. ఇందుకు ఈ నెల 21న ముహూర్తం ఫిక్స్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీలో క‌నుమ‌రుగైంది.

అయినప్పటికీ జీవీ రెడ్డి తన ప్రసంగాలతో కాంగ్రెస్ వాదనను వినిపిస్తున్నారు. ఆయనకు రాజకీయ, సామాజిక అంశాలపై అవగాహన ఉంది. అందువల్లే అనేక చర్చా వేదికల్లో కాంగ్రెస్ వాణిని ఆయన వినిపిస్తుంటారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన జీవీ రెడ్డి హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డ్డారు. సీఏతో పాటు న్యాయవిద్యలో వెంకట్‌రెడ్డి ప‌ట్టా అందుకున్నారు.

Shilpa

Shilpa

Next Story