Huzurabad: అభ్యర్ధికోసం కాంగ్రెస్ వేట.. రేస్ లో ముగ్గురి పేర్లు..

Huzurabad: హుజూరాబాద్‌ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌ కసరత్తు ప్రారంభించింది.

Arun Chilukuri
Published on: 13 Aug 2021 5:06 PM IST
Congress Committee to Finalise Huzurabad Bypoll Candidate
X

Huzurabad: అభ్యర్ధికోసం కాంగ్రెస్ వేట.. రేస్ లో ముగ్గురి పేర్లు..

Huzurabad: హుజూరాబాద్‌ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులను ప్రకటించి, ప్రచారం జోరుగా సాగిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్‌పై ఒత్తిడి పెరిగింది. హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పరిశీలనలో కొండ సురేఖతో పాటు సత్యనారాయణరెడ్డి, కృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. పత్తి కృష్ణారెడ్డి పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కృష్ణారెడ్డితో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మంతనాలు జరిపారు. రేపు పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీతో చర్చించి, కృష్ణారెడ్డి పేరును అధికారికంగా ప్రకటించే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. హుజూరాబాద్‌ బరిలో టీఆర్ఎస్‌ నుంచి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story