Vijayawada: టెన్షన్ టెన్షన్.. మెగా డీఎస్సీ కోసం చలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్‌ పిలుపు

Vijayawada: షర్మిలను సచివాలయం వైపు తీసుకెళ్లేలా పార్టీ శ్రేణుల ప్రణాళిక

Shekhar G
Updated on: 22 Feb 2024 2:08 PM IST
Congress Calls For Chalo Secretariat For Mega DSC
X

Vijayawada: టెన్షన్ టెన్షన్.. మెగా డీఎస్సీ కోసం చలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్‌ పిలుపు

Vijayawada: విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మెగా డీఎస్సీ కోసం కాంగ్రెస్ చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌‌ చేస్తున్నారు. ఉండవల్లి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. అయితే విజయవాడలో పోలీసుల వలయాన్ని ఛేదించుకుని కృష్ణా నది బ్రిడ్జి పైనుంచి ఉండవల్లి సెంటర్ రహదారి గుండా షర్మిలను సచివాలయం వైపు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులు ప్రణాళికలు వేస్తున్నారు. ఉండవల్లి సెంటర్ నుంచి సచివాలయం వరకు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో ఆ రహదారిని కాంగ్రెస్ నాయకులు పరిశీలిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story