Andhra Pradesh: చంద్రబాబు పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు

Andhra Pradesh: బోండా ఉమా నివాసంలో ఎమ్మెల్సీ వెంకన్న, నాగుల మీరా సమావేశం

Sandeep Eggoju
Updated on: 6 March 2021 1:11 PM IST
Chandrababu Tour issue In Andhra Pradesh
X

చంద్రబాబు పర్యటన (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విజయవాడ తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు తలెత్తాయి. పార్టీ సీనియర్ నేత బోండా ఉమా నివాసంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల మీరా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. మేయర్ ఎంపిక విషయంలో చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. చంద్రబాబును కేశినేని రాంగ్ ట్రాక్‌లోకి తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో చంద్రబాబు పర్యటన రూట్ మ్యాప్ మార్చడంపైనా గుర్రుగా ఉన్నారు.
Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story