అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటనపై కమిటీ

*ఎన్టీఆర్ ఆస్పత్రిలో 124 మందికి కొనసాగుతున్న చికిత్స

Rama Rao
Updated on: 4 Jun 2022 12:48 PM IST
Committee on Gas Leakage Incident in Atchutapuram | AP News
X

అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటనపై కమిటీ

Anakapalle: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లో అమ్మోనియా గ్యాస్ లీకేజీ ఘటనలో కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఒకవేళ నిబంధనలు పాటించలేదని తేలితే సంబంధిత నిందితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆస్పత్రిలో 124 మంది చికిత్స తీసుకుంటుండగా వీరిలో ఎవరికీ ప్రాణాపాయం లేదు. మరో 8 మందికి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మరోవైపు ఘటనపై సమగ్రమైన విచారణ జరపాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


Rama Rao

Rama Rao

Next Story