AP News: పుంగనూరు ఘటనపై విమర్శలు.. ఏపీ హోంమంత్రి వనిత ఎక్కడంటూ కామెంట్లు

AP News: వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, దాడులు

Shekhar G
Updated on: 5 Aug 2023 4:21 PM IST
Comments On AP Home Minister Taneti Vanitha
X

AP News: పుంగనూరు ఘటనపై విమర్శలు.. ఏపీ హోంమంత్రి వనిత ఎక్కడంటూ కామెంట్లు

AP News: అన్నమయ్య జిల్లా పుంగనూరు ఘటనపై ఏపీ హోంమంత్రి తానేటి వనితపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ హోంమంత్రి వనిత ఎక్కడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. నిన్న చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, దాడులు.. యుద్ధవాతావరణాన్ని తలపించాయి. పోలీస్‌ వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టడమే కాకుండా.. వారిపై దాడులకు కూడా దిగారు. ఆందోళనకారుల దాడుల్లో కొందరు పోలీసులకు గాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అయితే.. ఇంతజరిగినా ఈ ఘటనపై హోంమంత్రి స్పందించకపోవడం..ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పోలీసులకు గాయాలైనా హోంమంత్రి స్పందించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీస్‌శాఖ ఆస్తులు ధ్వంసమైనా పట్టించుకోలేదన్న ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి.ప్రతిపక్షనేతపై దాడి చేసినా హోంమంత్రి స్పందించలేదంటూ విమర్శలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. గతంలో రాష్ట్రంలో మహిళల మిస్సింగ్‌ సమయంలోనూ హోంమంత్రి కనిపించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

Shekhar G

Shekhar G

Next Story