ఏపీలో భారీ ఎత్తున కోడి పందాలు

ఏపీలో భారీ ఎత్తున కోడి పందాలు
x

Cockfights continue across Andhra Pradesh

Highlights

ఆంధ్రప్రదేశ్‌లో పందెం కోళ్లు కాలు దువ్వాయి. ఓ వైపు పోలీసులు పందాలపై నిఘా ఉంచినా మరోవైపు పందెం రాయుళ్లు మాత్రం అడ్డూ అదుపూ లేకుండా చెలరేగిపోయారు. దాంతో...

ఆంధ్రప్రదేశ్‌లో పందెం కోళ్లు కాలు దువ్వాయి. ఓ వైపు పోలీసులు పందాలపై నిఘా ఉంచినా మరోవైపు పందెం రాయుళ్లు మాత్రం అడ్డూ అదుపూ లేకుండా చెలరేగిపోయారు. దాంతో ఏపీలో కోడి పందాలతో పాటు గుండాట, పేకాట కూడా విచ్చలవిడిగా జరుగుతోంది.

పెద్దపండుగ వేళ పందేనికి సై అంటూ యధేచ్చగా బరులు మొదలెట్టారు పందెంరాయుళ్ళు. దానికి తోడు గుండాట, పేకాట, సహా అనేక జూద క్రీడలు సైతం ప్రాణం పోసుకున్నాయి. ఊపిరి తీసేసామనుకున్న పోలీసులు ఆశ్చర్యపడేలా పందెం బరులు మొదలయ్యాయి. వెయ్యితో మొదలైన పందెం లక్షల్లో చేరడంతో ఈ ఏడాది కూడా కోడి పందాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తేటతెల్లం చేస్తున్నాయి.

ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జోరుగా కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. కోడి పందాలకు ఫేమస్ అయిన భీమవరంలోనూ కోళ్ల కొట్లాట జోరందుకుంది. అటు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. పెద్ద మొత్తంలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. దీంతో కోడిపుంజులతో బరులన్నీ కోలాహలంగా మారిపోయాయి. పందాల బరుల దగ్గర పోలీసులు కూడా కనుచూపుమేరలో కనపడక పోవడంతో పందెంరాయుళ్లు రెచ్చిపోతున్నారు.

గుంటూరు జిల్లా రేపల్లె, వేమూరు, తెనాలితో పాటు పల్నాడు ప్రాంతంలో కోడిపందాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వేమూరులో ఎమ్మెల్యే మెరుగు నాగార్జున కోడిపందాలను వీక్షించారు. నిన్నటివరకు కోడిపందాలకు అనుమతిలేదని చెప్పిన పోలీసులు ఏమయ్యారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోడి పందాలకు తోడైన గుండాట, పేకాట దగ్గర పందెం రాయుళ్ళ జోరు మిన్నంటింది. కోడిపందేల ముసుగులో జూదం జోరుగా సాగుతోంది. వేలల్లో డబ్బులు పోగొట్టుకున్నారు పేద ప్రజలు.

ఏది ఏమైనా హైర్టు ఉత్తర్వులు పెడచెవిన పెట్టి కోడికి కత్తి కట్టారు పందెం రాయుళ్లు. అంతేనా పేకాట, గుండాట అంటూ జేబులు గుల్ల చేసుకునే వారు కొందరైతే. ఇదే అదనుగా అమాయకులనుంచి జేబులు నింపుకుంటున్నారు మరికొందరు.

Show Full Article
Print Article
Next Story
More Stories