జోరుగా కోడిపందాలు.. అర్ధరాత్రీ ఆగని బెట్టింగులు

జోరుగా కోడిపందాలు.. అర్ధరాత్రీ ఆగని బెట్టింగులు
x
Highlights

సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ కోడి పందాల నిర్వహణ ఏపీలో కాక రేపుతోంది. కోడి పందాల నిర్వహణ చట్ట ప్రకారం నేరమని.. నిర్వహిస్తే క్రిమినల్ కేసులు...

సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ కోడి పందాల నిర్వహణ ఏపీలో కాక రేపుతోంది. కోడి పందాల నిర్వహణ చట్ట ప్రకారం నేరమని.. నిర్వహిస్తే క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించినా ప్రజలు పట్టించుకోవడం లేదు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించి తీరుతామని చెబుతున్నారు.

తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడి పందాల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. లక్షలు ఖర్చు చేసి పందెం బరులను తీర్చిదిద్దారు. కృష్ణా జిల్లా బందరు, గన్నవరం సహా కొన్ని ప్రాంతాల్లో భోగి నాడే కోడిపందాలు మొదలవగా, మిగతా ప్రాంతాల్లో ఇవాళ మొదలయ్యాయి.

ఉభయగోదావరి జిల్లాల్లో కోడిపందేలు జోరుగా నిర్వహిస్తున్నారు. భోగి రోజే తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 50 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అనధికారిక అంచనా. పశ్చిమగోదావరిలోనూ కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి నిరాటంకంగా పందేలు నడిపించారు. ముందుగా బరులు పెడితే పోలీసులు ఒప్పుకోరని తొలుత సాంస్కృతిక, క్రీడా పోటీలు నిర్వహించారు. బరుల్లో జనాల్ని అదుపు చేసేందుకు ప్రైవేటు భద్రతా సిబ్బందినీ నిర్వాహ‍కులు నియమించారు.

తూర్పుగోదావరిలో పలుచోట్ల క్రికెట్‌ స్టేడియం మాదిరిగా ఏర్పాట్లు చేశారు. గ్యాలరీలు పెట్టి పాసులు ఉన్నవారినే అనుమతించారు. ఫ్లడ్‌లైట్లను ఏర్పాటుచేసి రాత్రి సమయాల్లోనూ నిర్వహించారు. 10వేల నుంచి10 లక్షల రూపాయల వరకు వేర్వేరు పందేలకు వేర్వేరు బరులను ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories