Godavari: జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

Godavari: పందేలు కాసేందుకు, చూసేందుకు భారీగా వస్తున్న జనం

Shekhar G
Published on: 15 Jan 2024 4:10 PM IST
Cock Fight In Andhra Pradesh Sankranti Special Kodi Pandalu 2024
X

Godavari: జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

Godavari: ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. లక్కవరం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, అల్లవరం, అమలాపురం రూరల్ మండలం కామనగరువు, ఇందుపల్లిలో సైతం పెద్ద బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిర్వాహకులు క్రికెట్ పోటీలను తలపించే రీతిలో కోడి పందేలు సాగిస్తున్నారు. కోడి పందేలను వీక్షించేందుకు, పందెం కాసేందుకు వేలు, లక్షల్లో తరలివస్తున్నారు.

పందేల రూపంలో కోట్ల రూపాయలు చేతులు మారతాయని అంచనా వేస్తున్నారు. తొలి రోజే సుమారు 6 కోట్ల వరకూ పందేలు జరిగాయని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉద్యోగాలు, వ్యాపారాలతో స్థిరపడిన వారందరూ కార్లలో సొంతూళ్లకు వచ్చి మరీ కోడి పందేలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. బరుల వద్దకు మోటార్ సైకిళ్లు, కార్లలో అధిక సంఖ్యలో వస్తున్నారు. పలుచోట్ల బరుల వద్ద గుండాటలు కూడా ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల వీటిని పోలీసులు అడ్డుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story