సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్ష

సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్ష
x
Highlights

రాష్ట్రంలోని ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ లకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు నిధులు సిద్ధంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్...

రాష్ట్రంలోని ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ లకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు నిధులు సిద్ధంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా చూడాలని కోరారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల నిర్వాసితులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రానికి వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని, అందువల్ల దీనిని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా రాయలసీమలోని కీలక ప్రాజెక్టులు అయిన పోతిరెడ్డిపాడు, గండికోట కాలువల విస్తరణ పనుల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వరద సమయాల్లో కృష్ణ జలాలను వీలైనంత ఎక్కువ మొత్తంలో తీసుకునేందుకు పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచాలని కోరారు.

అలాగే కడప జిల్లాలో కరువు పీడిత మండలాలు అయిన జమ్మలమడుగు, పులివెందుల, ముద్దనూరు, వేంపల్లె, వేముల మండలాలకు వ్యవసాయ కార్యకలాపాలకు సాగునీరు, తాగునీరు అందించడంలో భాగంగా. గండికోట రిజర్వాయర్ దిగువ ప్రవాహంలో 20 టిఎంసిఎఫ్ సామర్థ్యం గల మరో డ్యామ్ ను నిర్మించడానికి డిపిఆర్ తయారు చేయాలనీ సూచించారు. కాగా గత ఏడాది డిసెంబర్ 23 నుంచి 25 వరకు జరిగిన తన పర్యటనలో ఈ ప్రాజెక్టు ప్రైమరీ డీపీఆర్ ను పరిశీలించారు ముఖ్యమంత్రి. 2020 ఫిబ్రవరి నెలలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలనీ నిర్ణయించారు. ముద్దనూరు మండలంలోని ఆదివేటిపల్లి, తెనేటి పల్లి గ్రామాలలో ఆనకట్టను నిర్మించాలని అధికారులు సూచించినట్టు తెలుస్తోంది.

అలాగే సముద్రంలోకి వృధాగా పోతోన్న గోదావరి నది నీటిని కరువు పీడిత ప్రాంతాలకు బొల్లాపల్లి మీదుగా బనకచెర్లకు మళ్లించాలన్న ప్రతిపాదనలను, ఉత్తరాంధ్ర జిల్లాల కోసం ఏర్పాటు చేసిన సుజల స్రవంతి గురించి కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. విశాఖపట్నానికి నిరంతరాయంగా తాగునీటి సరఫరా చేయడానికి పైప్‌లైన్లు వేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories