Mega Vaccination: రికార్డు స్థాయిలో వ్యాక్సిన్.. సీఎం జగన్ అభినందనలు
Mega Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్ జాతీయ రికార్డు నమోదు చేసింది.
జగన్(ఫైల్ ఇమేజ్ )
Mega Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్ జాతీయ రికార్డు నమోదు చేసింది. ఒకేరోజు అత్యధిక మందికి టీకాలు వేసి తన రికార్డును తానే బ్రేక్ చేసింది. గతంలో ఒకే రోజు 6లక్షల మందికి వ్యాక్సిన్లు వేసి సరికొత్త రికార్డు నెలకొల్పిన ఏపీ ఇఫ్పుడు దాన్ని అధిగమించింది. ఈసారి ఏకంగా 13లక్షల మందికి ఒకే రోజు టీకాలు వేసి తన రికార్డును తానే బ్రేక్ చేసింది. 2వేల 232 కేంద్రాల ద్వారా 13లక్షల 26వేల 271మందికి ఒక్క రోజులోనే కోవిడ్ వ్యాక్సిన్లు వేశారు.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ వేసిన సిబ్బందికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే వేసే సమర్ధత ఉందని నిరూపించారని పేర్కొన్నారు. పటిష్ట యంత్రాంగంతో రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ సాధ్యమైందని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
Next Story




