MLA RK Roja: ఎమ్మెల్యే రోజాను పరామర్శించిన తెలంగాణ సీఎం

MLA RK Roja: జబర్ధస్త్ జడ్జి, ఎమ్మెల్యే రోజా ఆరోగ్య పరిస్థితిని పై ఆరా తీసిన తెలంగాణ సీఎం కేసీఆర్

Kranthi
Updated on: 24 April 2021 8:38 PM IST
CM Kcr Called Nagari Mla Roja
X

MLA RK Roja:(File Image)

MLA RK Roja: తెలుగు హీరోయిన్, జబర్ధస్త్ యాంకర్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పరామర్శించారు. వివరాల్లోకి వివరాల్లోకి వెళితే.... తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఎమ్మెల్యే రోజా ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. నెలరోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆర్కే రోజా శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆమె చెన్నై నగరంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ ఆమెకు ఫోన్‌ చేసి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా రోజా కుటుంబ సభ్యుల యోగక్షేమాలను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.

కాగా.. సీఎం కేసీఆర్ ఇటీవల కరోనావైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఫాం హౌస్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చారు. ఇదిలాఉంటే.. కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్‌కు, ఎంపీ సంతోష్ కుమార్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కాగా.. కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేయడంపై రోజా సంతోషం వ్యక్తంచేశారు.

Kranthi

Kranthi

Next Story