ఈ నెల 25, 26 తేదీల్లో కోనసీమ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం జగన్

Jyothi
Published on: 23 July 2022 1:06 PM IST
CM Jagan Visit to Konaseema District on 25th and 26th of This Month
X

ఈ నెల 25, 26 తేదీల్లో కోనసీమ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: ఈ నెల 25, 26 తేదీల్లో కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్. వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం లంక గ్రామాల ప్రజలను పరామర్శించనున్నారు జగన్. పి.గన్నవరం మండలం గంటిపెదపూడి వద్ద నదిపాయ తెగి ఇబ్బందులు పడుతున్న నాలుగు గ్రామాల ప్రజలతో పాటు లంకల గన్నవరం, మానేపల్లిలో వరద బాధితులను పరామర్శించనున్నారు.

సీఎం జగన్‌ పర్యటనతో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుతో కలిసి అమలాపురం ఆర్డీవో వసంత రాయుడు హెలిప్యాడ్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక కోనసీమ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ ఇవాళ ఖరారు కానుందని ఎమ్మెల్యే చిట్టిబాబు చెప్పారు.

Jyothi

Jyothi

Next Story