గోదావరి–కృష్ణా అనుసంధానంలో ఏపీ ప్రభుత్వం మరో బృహత్తర ఆలోచన

గోదావరి–కృష్ణా అనుసంధానంలో ఏపీ ప్రభుత్వం మరో బృహత్తర ఆలోచన
x
Highlights

సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను ప్రతి చుక్క సద్వినియోగం చేసుకునే దిశగా ఏపీ సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం...

సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను ప్రతి చుక్క సద్వినియోగం చేసుకునే దిశగా ఏపీ సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. జలవనరుల శాఖపై సీఎం జగన్ సమీక్షించారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

జలవనరుల శాఖపై ఏపీ సీఎం జగన్ నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, వంశధార సహా కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టులపై సీఎం జగన్ చర్చించారు. ప్రాంతాలు. ప్రాజెక్టులు, జిల్లాల వారీగా జరుగుతున్న పనులపై రివ్యూ చేశారు. ఇంత వరద వచ్చినా కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా నింపకపోవడంపై ఆరా తీశారు. కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో రిజర్వాయర్ల నీటిమట్టాలపై అధికారులు సీఎం జగన్ కు వివరించారు.

గోదావరి ద్వారా సముద్రంలో హృదాగా కలిసిపోతున్న నీటిని రోజుకు 23 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 210 టీఎంసీల వరద జలాలను తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందు కోసం బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కు తరలించేందుకు ప్రభుత్వం డీపీఆర్ తయారు చేయాలని నిర్ణయించింది. నాగార్జునసాగర్ కుడికాలువ ఆయకట్టులోని 9.61 లక్షల ఎకరాలు స్థిరీకరించాలని సాగర్ రెండో దశలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో మరో రెండు లక్షల ఎకరాలకు సాగు నీటి సధుపాయం కల్పించాలని భావిస్తున్నారు. అదే విధంగా గుంటూరు ప్రకాశం జిల్లాల తాగు నీటి అవసరాలను ఈ ప్రాజెక్టు ద్వారా తీర్చాలన్న ఆలోచన చేస్తుంది ప్రభుత్వం.

అదే విధంగా ఇటు పులిచింతల, అటు నాగార్జునసాగర్ పై ఆధారపడ్డ ప్రాంతాలకు బహొల్లపల్లి బ్యాలెన్సింగ్ రిజర్యావర్ లో నీరు ప్రాణాధారంగా నిలుస్తుందని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. గోదావరి డెల్టా అవసరాలకు పోగు మిగిలిన నీరు సముద్రంలోకి కలిసిపోకుండా కరవు, నీటికొరత ఉన్న ప్రాంతాలకు తరలించాలని యోచిస్తుంది ప్రభుత్వం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వెలిగొండతో పాటు కేసీ కెనాల్, తెలుగు గంగ ప్రాజెక్టు, ఎస్సార్ బీసి తదితర అవసరాల కోసం బనకచర్ల రెగ్యులేటర్ ద్వారా నీరిందించే అవకాశం ఉంది.

ఈ మొత్తం ప్రక్రియలో 460 కిలోమీటర్ల మేర నీటిని గ్రావిటీద్వారా, మరికొన్నిచోట్ల ఎత్తిపోతల ద్వారా తరలించనున్నారు. సముద్రమట్టానికి 37 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు ఉంటే 260 మీటర్ల ఎత్తులో బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌ ఉంది. అంటే 230 మీటర్ల ఎత్తుకు వివిధ దశల్లో నీటిని ఎత్తిపోస్తారు. ఇందు కోసం 2100 మెగావాట్ల కరెంటు అవసరం అవుతుంది.

ప్రాథమిక అంచనా ప్రకారం ప్రతిపాదిత ప్రాజెక్టు విలువ రూ.60వేల కోట్లపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టుల నిర్వాహణకు ఖర్చు చేసే నిధుల వినియోగంలో జాగ్రత్త వహించాలని సూచించిన ఏపీ సీఎం జగన్ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories