Andhra Pradesh: ఉపాధి హామీ పథకంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh: ఉపాది హామీ పథకంపై ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 30 March 2021 3:33 PM IST
CM Jagans key Remarks on the Employment Guarantee Scheme
X

Andhra Pradesh: ఉపాధి హామీ పథకంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh: ఉపాది హామీ పథకంపై ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపాది హామీ పనులను రికార్డుస్థాయిలో చేపట్టినట్లు తెలిపిన సీఎం ఇప్పటివరకూ 25.50 కోట్ల పనిదినాలను కల్పించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇంతకు ముందెన్నడూ ఈ స్థాయిలో జరగలేదన్నారు. కోవిడ్ సమయంలోనూ కూలీలను ఆదుకుని దేశంలోనే మూడో స్థానంలో నిలిచినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. చిన్న రాష్ట్రమైనా మూడోస్థానంలో నిలిచినందుకు గర్వంగా ఉందన్న సీఎం 5వేల 818 కోట్లు నేరుగా కూలీలకు ఇవ్వగలిగామని, ఇదే వేగంతో మరింత ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story