గడప గడపకు కార్యక్రమంపై నేతలకు సీఎం ఓరియంటేషన్ క్లాస్

CM Jagan: రేపు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో సమావేశం

Jyothi
Published on: 7 Jun 2022 10:59 AM IST
CM Jagan Focus On Our Government Program For Gadapa Gadapaku
X

గడప గడపకు కార్యక్రమంపై నేతలకు సీఎం ఓరియంటేషన్ క్లాస్

CM Jagan: ఏపీలో వైసీపీ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్యకర్రమంపై ఆ పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఫోకస్ పెట్టారు. ఈ కార్యక్ర‌మానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇప్ప‌టికే జ‌గ‌న్ చెంత‌కు చేరినట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నివేదిక‌ను ఇప్ప‌టికే ప‌రిశీలించిన జ‌గ‌న్‌…ఈ కార్య‌క్ర‌మంపై రేపు స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు.

ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, వాటి పరిష్కారంపై దృష్టిపెట్టనున్నారు జగన్. కార్యక్రమంలో మరింత వేగం పెంచేలా దిశానిర్దేశం చేయనున్నారు. ఇంకా కార్యక్రమం ప్రారంభంకాని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే నెలలో జరిగే ప్లీనరీతో పాటు కొత్త కార్యక్రమాలపై కూడా చర్చించనున్నారు.

Jyothi

Jyothi

Next Story