CM Jagan: శ్రీసత్యసాయి ఆటోప్రమాదంపై సీఎం జగన్ సంతాపం

CM Jagan: మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం

Rama Rao
Published on: 30 Jun 2022 10:13 AM IST
CM Jagans Condolence Over Sri Sathya Sais Auto Accident
X

CM Jagan: శ్రీసత్యసాయి ఆటోప్రమాదంపై సీఎం జగన్ సంతాపం

CM Jagan: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద హైటెన్షన్ విద్యుత్‌ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో ప్రాణాలు కోల్పోవడంపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆటో ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. పారిస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఘటన వివరాలు తెలియజేశారు అధికారులు.

Rama Rao

Rama Rao

Next Story