Andhra Pradesh: తిరుపతి లోక్‌సభ పరిధిలోని కుటుంబాలకు సీఎం జగన్ లేఖలు

X
Andhra Pradesh: తిరుపతి లోక్‌సభ పరిధిలోని కుటుంబాలకు సీఎం జగన్ లేఖలు
Highlights
Andhra Pradesh: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని కుటుంబాలకు సీఎం జగన్ లేఖలు రాశారు.
Arun Chilukuri8 April 2021 1:00 PM GMT
Andhra Pradesh: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని కుటుంబాలకు సీఎం జగన్ లేఖలు రాశారు. 22 నెలల పాలనా కాలంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన మేలును ఈ లేఖలో వివరించారు. క్యాంపు కార్యాలయంలో తొలి లేఖపై జగన్ సంతకం చేశారు.
వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ ఆసరా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ పింఛన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు తదితర పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన లబ్ధిని ఈ లేఖల్లో పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని లేఖలో జగన్ అభ్యర్ధించారు. ఈ లేఖలను లబ్ధిదారులకు వైసీపీ నేతలు అందించనున్నట్టు చెబుతున్నారు.
Web TitleCM Jagan Written Letters to Tirupati Loksabha Voters
Next Story