CM Jagan: నేడు నామినేషన్ దాఖలు చేయనున్న సీఎం జగన్

CM Jagan: పులివెందులలో తన నామినేషన్ దాఖలు చేయనున్న సీఎం

Shashank Gullapelli
Published on: 25 April 2024 9:53 AM IST
CM Jagan Will File Nomination Today
X

CM Jagan: నేడు నామినేషన్ దాఖలు చేయనున్న సీఎం జగన్

CM Jagan: ఏపీ సీఎం జగన్ నేడు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నిన్నటితో మేమంతా బస్సు యాత్ర ముగియడంతో నేడు పులివెందులలో పర్యటించనున్నారు. ఎన్నికల ముందు పులివెందులలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం పులివెందుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మొదట స్థానిక సీఎస్‌ఐ చర్చి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్‌ కార్యాలయానికి చేరుకొని నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఆ తర్వాత భాకరాపురంలోని తన నివాసానికి వెళ్తారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story