CM Jagan: మరికొన్నిరోజుల్లో విశాఖకు షిప్ట్‌కానున్న సీఎం జగన్

CM Jagan will be shifted to Visakhapatnam in a Few Days
x

CM Jagan: మరికొన్నిరోజుల్లో విశాఖకు షిప్ట్‌కానున్న సీఎం జగన్

Highlights

CM Jagan: ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ చేసిన ఏపీ ప్రభుత్వం

CM Jagan: ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం నుంచి పాలన మరి కొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. సీఎం జగన్ విశాఖకు మకాం మారేందుకు అంతా సిద్ధమౌతోంది. ఇక ముహూర్తం కూడా ఫిక్స్ అవడంతో పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ నివాసం కోసం రుషికొండలో ఆరు భవనాలు సిద్ధం చేశారు.

దసరా నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలనకు ముహూర్తం ఫిక్స్ చేశారు సీఎం జగన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు అనుబంధ శాఖాధికారులు కూడా విశాఖ నుంచే పరిపాలన సాగించనున్నారు. కార్యాలయాలను తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది.

అయితే ఇతర శాఖలు, అధికారుల వసతి కోసం భవనాలు వెతుకుతోంది జిల్లా యంత్రాంగం. వసతుల కమిటీకి భవనాల ఎంపిక పనులు అప్పగించారు. పంచాయతీరాజ్ శాఖకు జిల్లా పరిషత్ గెస్ట్‌హౌస్.. పురపాలకశాఖకు స్మార్ట్ సిటీ భవనం, జలవనరుల శాఖకు ఈఎన్‌సీ భవనం కేటాయించారు. సీఎం పేషీ నిర్వహణ కోసం రుషికొండ పరిసరాల్లో 128 ప్లాట్లను అద్దెకు తీసుకునేందుకు అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. కాగా ఇప్పటికే రుషికొండలో ఇంటీరియర్ పూర్తి చేశారు. పోలీసు అవుట్ పోస్టులు పనులు కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories