Y S Bharathi: పులివెందులలో సీఎం జగన్ సతీమణి భారతి ప్రచారం

Y S Bharathi: వేంపల్లి లో ప్రచారం నిర్వహించిన వైఎస్ భారతి

Shashank Gullapelli
Published on: 29 April 2024 12:27 PM IST
CM Jagan Wife Bharathi Is Campaigning In Pulivendula
X

Y S Bharathi: పులివెందులలో సీఎం జగన్ సతీమణి భారతి ప్రచారం

Y S Bharathi: పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్ సతీమణి భారతి రెండో రోజు వేంపల్లిలో ప్రచారం చేస్తున్నారు. మొదటిరోజు తొండూరు మండలం ఇడమడక గ్రామంలో వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమతతో కలిసి ప్రచారం చేశారు. రెండవ రోజు వేంపల్లి పట్టణంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ భారతికి శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ సతీష్ రెడ్డి సతీమణి సుమతీరెడ్డి ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను తప్పనిసరిగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వేంపల్లి పట్టణంలో అడుగడుగునా భారతిరెడ్డికి స్వాగతం పలికారు. జగన్ అభిమానులు, వైసీపీ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story