CM Jagan: ఏపీలో సీఎం జగన్ సుడిగాలి పర్యటనలు

CM Jagan: రోజుకు 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసీపీ ప్రచారం

Shashank Gullapelli
Published on: 30 April 2024 9:30 AM IST
CM Jagan Whirlwind Tours In AP
X

CM Jagan: ఏపీలో సీఎం జగన్ సుడిగాలి పర్యటనలు

CM Jagan: నామినేషన్ల పర్వం ముగియడంతో ఏపీలో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్‌...సుడిగాలి పర్యటనలు కొనసాగిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రోజుకు మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో సీఎం పర్యటిస్తున్నారు. విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ మళ్లీ అధికారం ఇస్తే, వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తామో చెబుతూ ముందుకు సాగుతున్నారు.

ఏపీ సీఎం జగన్‌ ఇవాళ మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. కాసేపట్లో ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కొండపి నియోజకవర్గంలో పర్యటిస్తారు. టంగుటూరులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు సీఎం. ఒంగోలు నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు కొండపి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిమూలపు సురేష్‌ని గెలిపించాలని ఓటర్లను కోరనున్నారు జగన్‌. టంగుటూరులో పర్యటన తర్వాత మధ్యాహ్నం 12.30కి కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు సీఎం జగన్‌. మైదుకూరు 4 రోడ్ల జంక్షన్‌లో జరిగే సభలో పాల్గొంటారు. కడప నుంచి ఎంపీ అభ్యర్ధిగా అవినాష్‌రెడ్డి, మైదుకూరు అసెంబ్లీ స్థానం నుంచి రఘురామిరెడ్డి పోటీ చేస్తున్నారు.

కడప పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రచారం తర్వాత మధ్యాహ్నం రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు సీఎం జగన్‌. కాగా, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మిథున్‌రెడ్డి, పీలేరు అభ్యర్థిగా చింతల రాంచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story