ఢిల్లీకి బయలుదేరిన సీఎం జగన్‌

Arun Chilukuri
Published on: 5 Oct 2020 4:12 PM IST
ఢిల్లీకి బయలుదేరిన సీఎం జగన్‌
X

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ బయలు దేరారు. కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఇద్దరు ఎంపీలు, 10 మంది బృందంతో కలిసి జగన్ ఢిల్లీ పయనమయ్యారు. ఇవాళ ఉదయం పులివెందులలోని భాకారాపురంలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో జరిగిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం నేరుగా కడప నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్న జగన్ వెంటనే. అక్కడ్నుంచి తన బృందంతో ఢిల్లీ బయల్దేరారు.

ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయ సమాచారం ప్రకారం.. సాయంత్రం5.00 ఢిల్లీ ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. 5.10 ఢిల్లీ ఎయిర్‌ పోర్టు నుంచి 1–జనపథ్‌కు బయలు దేరుతారు. 5.50 ఢిల్లీలోని1– జనపథ్‌కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారని కార్యాలయ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి. కాగా రేపు నదీ జలాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. సమావేశంపై ఇప్పటికే సంబంధిత అధికారులకు సీఎం దిశానిర్దేశం కూడా చేశారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story