CM Jagan: నేడు ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్

CM Jagan: జనగ్ ఢిల్లీ పర్యటనలో అమిత్‌షా, గజేంద్ర సింగ్‌షెకావత్‌ సహా పలువురు కేంద్రమంత్రులతో సీఎం జ‌గ‌న్ భేటీకానున్నారు.

Kranthi
Published on: 10 Jun 2021 7:44 AM IST
CM Jagan Visiting Delhi Today
X

CM Jagan:(File Image)

CM Jagan: ఢిల్లీలో నేడు జగన్ మంత్రాంగం నడవబోతుంది. హోంమంత్రి అమిత్ షాతో రాత్రి 9 గంటలకు అపాయింట్ మెంట్ ఫిక్సయింది. ఆయనతో పాటు గజేంద్రసింగ్ షెకావత్, మరియు ఇతర కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం వేడి మీద ఉండటంతో... ఈ పర్యటన కీలకంగా మారింది. అలాగే పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారితో చర్చించనున్నట్లు సమాచారం.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బిల్లులు, కొవిడ్‌ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం వంటి అంశాలనూ సీఎం చర్చించే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర సహకారాన్నీ కోరతారని సమాచారం.

Kranthi

Kranthi

Next Story