Jagan: నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

Jagan: 'ఆడుదాం ఆంధ్ర' రాష్ట్ర స్థాయి ముగింపు కార్యక్రమంలో ముగింపు వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్‌

Jyothi
Published on: 13 Feb 2024 9:43 AM IST
CM Jagan Visit to Visakhapatnam today
X

Jagan: నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

Jagan: ఏపీ వ్యాప్తంగా 50 రోజుల పాటు సాగిన ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. విశాఖ సాగర తీరంలో ముగింపు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమం కోసం సీఎం జగన్‌ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేస్తారు. ఇందుకోసం సీఎం జగన్‌ సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు.

పీఎం పాలెంలోని వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియానికి వెళ్లి క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి చేరుకుంటారు.

Jyothi

Jyothi

Next Story