నేడు రాజమండ్రిలో సీఎం జగన్ పర్యటన

Jagan: పెన్షన్ లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి

Jyothi
Updated on: 3 Jan 2023 11:56 AM IST
CM Jagan Visit to Rajahmundry Today
X

నేడు రాజమండ్రిలో సీఎం జగన్ పర్యటన

Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇవాల తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప‌ర్యటించనున్నారు. పెన్షన్‌ కానుక పెంపుదల అనంతరం.. లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. 11 గంటల 20 నిమిషాల నుంచి ఒంటి గంట 10 నిమిషాల వరకు ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో.. పెన్షన్‌ కానుక పెంపుదల, లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడతారు. కార్యక్రమం ముగిశాక.. మధ్యాహ్నం రెండున్నర గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో.. అధికారులు, నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.


Jyothi

Jyothi

Next Story