Jagan: రేపు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏపీ సీఎం జగన్ పర్యటన

CM Jagan Visit to Machilipatnam and Krishna District Tomorrow
x

Jagan: రేపు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏపీ సీఎం జగన్ పర్యటన

Highlights

Jagan: బందరు పోర్టు నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం

Jagan: ఏపీ సీఎం జగన్‌ రేపు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బందరు పోర్టు నిర్మాణ పనులను ఆయన ప్రారంభిస్తారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి బందరు మండల పరిధిలోని తపసిపూడి గ్రామం చేరుకుంటారు. అక్కడి నుంచి పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ చేసిన అనంతరం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత మచిలీపట్నంలోని జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్‌ సెంటర్‌లోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి వెళ్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం మచిలీపట్నం నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories