ఇవాళ కృష్ణా జిల్లాలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడుత పంపిణీ కార్యక్రమం

Jyothi
Published on: 25 Aug 2022 6:28 AM IST
CM Jagan Visit to Krishna District Today
X

ఇవాళ కృష్ణా జిల్లాలో సీఎం జగన్ పర్యటన 

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడుత పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఉదయం పది గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 10.40 గంటలకు పెడన చేరుకుంటారు. బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని..లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం నిధుల ద్వారా 80 వేల 546 మంది ఖాతాల్లోకి 193కోట్ల 31 లక్షల రూపాయల నిధులు జమ చేయనున్నారు. సొంత మగ్గం కల్గిన ప్రతి చేనేత కుటుంబానికి 24 వేల ఆర్ధిక సాయం అందిస్తారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Jyothi

Jyothi

Next Story