ఇవాళ కోనసీమ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం

Jyothi
Published on: 26 July 2022 8:44 AM IST
CM Jagan Visit to Konaseema District Today
X

ఇవాళ కోనసీమ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: ఇవాళ కోనసీమ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం బాధితులతో మాట్లాడనున్నారు సీఎం. కాసేపట్లో తాడేపల్లి నుంచి బయల్దేరి పదిన్నర గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడికి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి 11 గంటలకు పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు. అరిగెలవారిపేట, ఉడిమూడిలంక వరద బాధితులతో మాట్లాడతారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు వాడ్రేవుపల్లి, రాజోలు మండలం మేకలపాలెంలో పర్యటిస్తారు. సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద ప్రభావం, అనంతరం తీసుకున్న సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రికి రాజమండ్రిలోనే బసచేస్తారు సీఎం జగన్.

Jyothi

Jyothi

Next Story