ఈ రోజు హైదరాబాద్, రేపు ఢిల్లీలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan Visit to Hyderabad Today and Delhi Tomorrow
x

 ఈ రోజు హైదరాబాద్, రేపు ఢిల్లీలో సీఎం జగన్‌ పర్యటన

Highlights

CM Jagan: నేడు, రేపు ఏపీ సీఎం జగన్‌ బిజీ షెడ్యూల్

CM Jagan: నేడు, రేపు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా, హైదరాబాద్, ఢిల్లీ పర్యటనలతో బిజీ బిజీగా గడపనున్నారు. ఈరోజు ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగే స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి శంషాబాద్‌ వెళ్ళనున్న సీఎం నార్సింగిలోని ఓమ్‌ కన్వెన్షన్‌లో జీవీ.ప్రతాప్‌ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరై రాత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ వెళతారు. రేపు రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరగనున్న నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి సాయంత్రం ఢిల్లీ నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories