CM Jagan: నేడు గుడివాడలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించనున్న జగన్

Jyothi
Published on: 16 Jun 2023 9:21 AM IST
CM Jagan visit to Gudivada Today
X

CM Jagan: నేడు గుడివాడలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: సీఎం జగన్... ఇవాళ కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించనున్నారు. గుడివాడలోని మల్లాయపాలెం టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించనున్న జగన్.. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడనున్నారు సీఎం జగన్‌. ఇక, హెలిపాడ్ దగ్గర స్థానిక పార్టీ నేతలతో ఇంటరాక్ట్ కానున్నారు.

మొత్తంగా ఇవాళ 8వేల, 912 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో 300 ఎకరాల్లో 8వేల, 912 ఇళ్లను నిర్మించారు. అంతేకాకుండా, నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు పథకం కింద టిడ్కో కాలనీకి ఆనుకుని 6వేల, 700 వ్యక్తిగత ఇళ్లు కూడా నిర్మిస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 27వేల, 872 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఏపీ టిడ్కో.. పట్టణ ప్రాంతాల్లో 27వేల, 872 ఇళ్లను నిర్మిస్తోంది. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, ఉయ్యూరులో ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే 8వేల,912 టిడ్కో ఇళ్లు పూర్తి చేశారు. ఇక, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సొంత నియోజకవర్గం కావడంతో ఆయన దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటనకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, గతంలోనే ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా.. సీఎం పర్యటన వాయిదా పడింది. ఇవాళ మొత్తంగా లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story