గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్

*వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్

Rama Rao
Published on: 20 May 2022 9:47 AM IST
CM Jagan Visit in Davos For World Economic Forum Conference
X

గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్

CM Jagan: ఏపీ సీఎం జగన్ దావోస్ బయలుదేరారు. తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి స్విట్జర్లాండ్‌కు పయనమయ్యారు. సీఎం హోదాలో తొలిసారి అధికారికంగా విదేశీ పర్యటన చేయబోతున్నారు. సీఎం అయిన తర్వాత జగన్ లండన్, అమెరికా వెళ్లినా అది పూర్తిగా వ్యక్తిగత పర్యటన. అయితే ఇప్పుడు సీఎం హోదాలో జగన్ దావోస్ వెళ్లారు.

పర్యటనలో భాగంగా ఈనెల 22 నుంచి 26 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సీఎం జగన్‌తో మంత్రులు, అధికారుల బృందం పాల్గొననున్నారు. కోవిల్ లాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లకు పరిష్కారాలను ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం జగన్ దావోస్ వేదికగా వివరించనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story