CM Jagan: ఇవాళ బాపట్ల జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: యడ్లపల్లి జడ్పీ హైస్కూల్‌లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

Jyothi
Updated on: 21 Dec 2022 8:49 AM IST
CM Jagan Visit to Bapatla District Today
X

CM Jagan: ఇవాళ బాపట్ల జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: ఇవాళ బాపట్ల జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. యడ్లపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూ్ల్‌లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. 11 గంటలకు యడ్లపల్లి జెడ్పీ హైస్కూల్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తారు. 4 లక్షల 59 వేల 5వందల 64 మంది విద్యార్థులతో పాటు.. 59 వేల 176 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లను పంపిణీ చేయనుంది ఏపీ సర్కార్‌. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 18 వేల 740 ట్యాబ్‌లు పంపిణీ చేయనుంది. 778 కోట్ల విలువైన బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌తో.. 686 కోట్ల విలువైన 5 లక్షల 18 వేల 740 ట్యాబ్‌లను ఉచితంగా పంపిణీ చేయనుంది జగన్‌ ప్రభుత్వం. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం జరగనుంది.

Jyothi

Jyothi

Next Story