నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్

Jyothi
Updated on: 30 Dec 2022 1:28 PM IST
CM Jagan Visit to Anakapalle District Today
X

నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: ఏపీ సీఎం జగన్ నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో తలపెట్టిన అభివృద్ధి పనులకు, ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఉదయం 9గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వైఎస్ జగన్ బయలుదేరతారు. 10.25కు నర్సీపట్నం మండలం బలిఘట్టం చేరుకుంటారు. 11.15 నుంచి 12.50 గంటల మధ్య జోగునాథునిపలెం వద్ద నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడతారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇక సీఎం జగన్ పర్యటనకు మంత్రి అమర్నాథ్, అధికారులు ఏర్పాట్లు చేశారు.

Jyothi

Jyothi

Next Story