CM Jagan: ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ టూర్‌

CM Jagan Tour of Delhi is over
x

CM Jagan: ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ టూర్‌

Highlights

CM Jagan: మోడీ, అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌తో వరుసగా భేటీ

CM Jagan: ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన ముగిసింది. టూర్‌లో భాగంగా.. ఏపీ ముఖ్యమంత్రి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో వరుస భేటీ అయ్యారు. ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు సీఎం జగన్. దాదాపు 45 నిమిషాల పాటు పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ఆ తర్వాత ప్రధాని మోడీతో సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారు సీఎం జగన్.

విభజన హామీలు, పెండింగ్‌ అం‎శాలపై చర్చించినట్టు సమాచారం. అనంతరం.. అక్కడి నుంచి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నివాసానికి చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి.. నిర్మలమ్మతో 20 నిమిషాల పాటు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మొత్తానికి సీఎం జగన్‌ ఢిల్లీ టూర్‌లో భాగంగా.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వీరితో చర్చించనట్టు సమాచారం. మరోవైపు.. సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన ఫలప్రదంగా జరిగిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories