కేంద్ర బృందంతో నేడు సీఎం జగన్ భేటి

కేంద్ర బృందంతో నేడు సీఎం జగన్ భేటి
x
Highlights

ఏపీ సీఎం జగన్ నేడు కేంద్ర బృందంతో భేటీ కానున్నారు. ఏపీలో వర్షాలు, వరదలు కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను రెండు రోజుల పాటు పరిశీలించిన కేంద్ర బృందం ఈరోజు...

ఏపీ సీఎం జగన్ నేడు కేంద్ర బృందంతో భేటీ కానున్నారు. ఏపీలో వర్షాలు, వరదలు కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను రెండు రోజుల పాటు పరిశీలించిన కేంద్ర బృందం ఈరోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సీఎం ను కలవనున్నారు. వరద నష్టంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన సీఎస్ 6 వేల 386 కోట్ల నష్టం సంభవించినట్లు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. తాత్కాలిక సహయ చర్యలకు 840 కోట్లు అవసరం కాగా, శాశ్వత పునఃరుద్ధరణ చర్యలకు 4 వేల 439 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

ఇక 2 లక్షల 12 వేల హెక్టార్లలో పంట దెబ్బతిని 903 కోట్లు నష్టం వాటిల్లిందని అలాగే 24 వేల 515 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిని 483 కోట్లు నష్టం ఏర్పడినట్లు నివేదిక సమర్పించారు. తక్షణ సాయం, తడి ధాన్యం కొనుగోలుపై సడలింపులు ఇవ్వాలని కేంద్ర బృందానికి సీఎం జగన్ కోరనున్నారు. ఐతే, వరద కారణంగా జరిగిన నష్టాన్ని భర్తీ చేయ్యడానికి ఆదుకోవాలని ఇప్పటికే ప్రధానికి సీఎం జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories