CM Jagan: ఈనెల 21న లండన్‌కు సీఎం జగన్

CM Jagan: వారం రోజుల పాటు లండన్‌లో పర్యటించనున్న జగన్

Jyothi
Updated on: 10 April 2023 9:00 PM IST
CM Jagan to London on 21st of this Month
X

CM Jagan: ఈనెల 21న లండన్‌కు సీఎం జగన్

CM Jagan: ఈ నెల 21న సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. వారం రోజుల పాటు కుటుంబసభ్యులతో లండన్‌లో జగన్ పర్యటన సాగనుంది. సీఎం జగన్ లండన్ పర్యటన అధికారిక పర్యటన కాదని... పూర్తిగా వ్యక్తిగత పర్యటనేనని పార్టీ వర్గాలంటున్నాయి.

సీఎం జగన్ పెద్ద కుమార్తె లండన్‌లో చదువుకుంటున్నారు. కుమార్తెను చూసేందుకు జగన్ లండన్ వెళుతున్నట్లు వైసీపీ వర్గాలంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి వెళ్లేందుకు సమయం కుదరదని భావిస్తున్న జగన్... ఇప్పుడే వెళుతున్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story