వైఎస్ తర్వాత ఏ సీఎం రాయచోటిని పట్టించుకోలేదు : సీఎం జగన్

వైఎస్ తర్వాత ఏ సీఎం రాయచోటిని పట్టించుకోలేదు : సీఎం జగన్
x
జగన్
Highlights

రాయలసీమలో అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయచోటి అని తాగునీరు, సాగునీరు కోసం అల్లాడుతున్న నియోజకవర్గం అని సీఎం జగన్ అన్నారు. రాయచోటిని వైఎస్ తర్వాత ఏ...

రాయలసీమలో అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయచోటి అని తాగునీరు, సాగునీరు కోసం అల్లాడుతున్న నియోజకవర్గం అని సీఎం జగన్ అన్నారు. రాయచోటిని వైఎస్ తర్వాత ఏ ముఖ్యమంత్రీ పట్టించుకోలేదని తెలిపారు. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మం‍గళవారం శంకుస్థాపన చేశారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే రాయచోటి అభివృద్ధికి 2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. హంద్రీ నీవా ద్వారా రాయచోటి, వేంపల్లి మండలాలకు గాలేరు సుజల స్రవంతి, హంద్రీ నీవాలను అనుసంధానించడం ద్వారా తంబళ్లపల్లి, మదనపల్లె, పుంగనూరు, కుప్పంలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories