CM Jagan: పోరాట యోధుల్లో మహా అగ్నికణం అల్లూరి

CM Jagan: అల్లూరి ఒక మహా అగ్ని కణం.. ఆయన తెలుగు గడ్డపై పుట్టడం గర్వకారణం

Rama Rao
Updated on: 4 July 2022 12:50 PM IST
CM Jagan Speech in Azadi Ka Amrit Mahotsav in Bhimavaram
X

CM Jagan: అల్లూరి ఒక మహా అగ్ని కణం.. ఆయన తెలుగు గడ్డపై పుట్టడం గర్వకారణం

CM Jagan: లక్షలాది మంది త్యాగాల ఫలితమే నేటి భారతదేశమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల్లో భాగంగా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీతో కలిసి సీఎం పాల్గొన్నారు. పోరాటయోధుల్లో మహా అగ్నికణం అల్లూరి సీతారామరాజు అని అల్లూరి జయంతిని పురస్కరించుకుని వేడుకలు చేసుకోవడం సంతోషకరమన్నారు.

ఒక మనిషిని ఇంకొక మనిషి ఒక జాతిని మరొక జాతి ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారన్నారు సీఎం జగన్. దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారన్నారు. అల్లూరి ఒక మహా అగ్ని కణం.. ఆయన తెలుగు గడ్డపై పుట్టడం గర్వకారణమని సీఎం జగన్‌ అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story