విశాఖ వైసీపీ నేతలపై సీఎం జగన్‌ సీరియస్‌.. తాడేపల్లి రావాలని..

Arun Chilukuri
Published on: 12 Nov 2020 3:15 PM IST
విశాఖ వైసీపీ నేతలపై సీఎం జగన్‌ సీరియస్‌.. తాడేపల్లి రావాలని..
X

విశాఖ వైసీపీ నేతలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్‌ అయ్యారు. విశాఖ జిల్లా అభివృద్ధిపై జరిగిన సమావేశంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు పరస్పరం తిట్టుకోవడంపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. విశాఖ వైసీపీ నేతల మధ్య గొడవపై ఇప్పటికే ఇన్‌ఛార్జ్ మంత్రి కన్నబాబుతో చర్చించిన జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వైసీపీ లీడర్లను వెంటనే తాడేపల్లి రావాలని ఆదేశించారు. దాంతో, విశాఖ వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు తాడేపల్లికి బయల్దేరారు. విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్‌నాథ్, ధర్మశ్రీ ఇప్పటికే తాడేపల్లి చేరుకున్నారు. కాసేపట్లో వైజాగ్ వైసీపీ నేతలతో సమావేశంకానున్న సీఎం జగన్ క్లాస్ పీకనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story