CM Jagan: గ్రామ సచివాలయ సిబ్బందిపై సీఎం జగన్‌ ఆగ్రహం

CM Jagan: ఇన్‌స్పెక్షన్స్‌ చేయకపోతే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? కొందరి ఫర్మామెన్స్‌ బాగోలేదు వారికి మెమోలు జారీ చేశాం

Sandeep Eggoju
Published on: 27 July 2021 6:06 PM IST
CM Jagan Serious on Village Secretariat Staff
X
గ్రామా సెక్రటేరియట్ స్టాఫ్ పై సీఎం జగన్ సీరియస్ 

CM Jagan: గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది గైర్హాజరుపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇన్‌స్పెక్షన్స్‌ చేయకపోతే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. కొందరి ఫర్మామెన్స్‌ బాగోలేదన్న జగన్‌ వారికి మెమోలు జారీ చేసినట్లు చెప్పారు. మెమోలు జారీ చేయడం తనకు బాధ కల్గించిందన్న జగన్‌ చేయకపోతే అధికారులను గాడిలో పెట్టలేమన్నారు. ఇన్‌స్పెక్షన్‌ చేస్తేనే తప్పులు దిద్దుకునే అవకాశం ఉందని ఇక వచ్చే స్పందన కార్యక్రమంలోగా పర్యావేక్షణ పూర్తిచేయాలన్నారు. వైసీపీకి ఓటు వేయని అర్హులకు కూడా పథకాలు అందాలని.. ఏవైనా లోపాలు, ఇబ్బందులు ఉంటే పైస్థాయి అధికారులకు చెప్పాలని సూచనలు చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story