YS Jagan: యువతిపై పెట్రోల్ దాడి ఘటనపై సీఎం సీరియస్

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడవాడ గ్రామంలో ప్రియుడి చేతిలో యువతి పెట్రోల్ దాడికి గురైన ఘటనపై జగన్ సీరియస్ అయ్యారు.

Arun Chilukuri
Updated on: 20 Aug 2021 4:28 PM IST
CM Jagan Serious About the Incident of Petrol Attack on a Young Woman
X

యువతిపై పెట్రోల్ దాడి ఘటనపై సీఎం సీరియస్

Vizianagaram: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడవాడ గ్రామంలో ప్రియుడి చేతిలో యువతి పెట్రోల్ దాడికి గురైన ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను విశాఖ తరలించాలని ఆదేశించారు.

రాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగిందని బాధితులు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగానే వెంటనే పోలీసులు స్పందించి బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చినట్లు అధికారులు జగన్ కు తెలిపారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి అవసరమైన సాయం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణను సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి బొత్స, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి బాధితురాలిని సందర్శించి, పరామర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story